- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్నతోనే ఉంటా.. సస్పెన్స్‌కు తెరదించిన తమ్ముడు కృష్ణుడు
దిశ, తుని: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో తుని నియోజకవర్గ తాజా మాజీ ఇంచార్జ్ యనమల కృష్ణుడు భేటీ అయ్యారు. ఇటీవలే తుని నియోజకవర్గ ఇంచార్జిగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్యని అధిష్టానం ప్రకటించింది. దీంతో కృష్ణుడు అలక పాన్పు ఎక్కారు. సోదరుడి మీద గుర్రుగా ఉన్న కృష్ణుడికి వైసీపీ నుంచి బంఫర్ ఆఫర్ వచ్చింది. ఈ విషయం అధినేత చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో కృష్ణుడిని అమరావతి రావాలని ఆదేశించారు. ఈ మేరకు చంద్రబాబుతో సమావేశమయ్యారు. భవిష్యత్తుపై చంద్రబాబు హామీ ఇవ్వడంతో కృష్ణుడు సర్దుమనిగారు.
తాను టీడీపీ లోనే కొనసాగుతానని కృష్ణుడు స్పష్టంశారు. 'తనకు, తన సోదరుడు యనమల రామకృష్ణుడు మధ్య ఎటువంటి విభేదాలు లేవని తెలిపారు. దివ్య తన కూతురు లాంటిదని చెప్పారు. యనమల రామకృష్ణుడు గెలుపు కోసం ఎలా పని చేసానో, దివ్య గెలుపు కోసం కూడా అలానే పని చేస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపే అందరి లక్ష్యమని వివరించారు.