- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Skill Case: చంద్రబాబుకు వైద్య పరీక్షలు.. విచారణలో 50 ప్రశ్నలు..!
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును కస్టడీలో సీఐడీ అధికారులు ప్రశ్నించారు. రెండు రోజలు పాటు కస్టడీలో భాగంగా తొలి రోజు విచారణ ముగిసింది. శనివారం ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ చంద్రబాబుపై సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే చంద్రబాబును కస్టడీకి తీసుకునే ముందు వైద్య పరీక్షలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు సీఐడీ తొలి రోజు విచారణ ముగియడంతో మరోసారి చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
శనివారం ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాలులో లాయర్ సమక్షంలో సీఐడీ అధికారులు ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పిన అన్ని సమాధానాలను రికార్డ్ చేశారు. దాదాపు 120 ప్రశ్నలతో విచారణకు వెళ్లిన అధికారులు 50 క్వశ్చన్స్ అడిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రతీ విషయాన్ని కూడా పిన్ టు పిన్ టైప్ చేసి నివేదిక రెడీ చేశారు. 7 గంటల పాటు జరిగిన ఇంటరాగేషన్ మొత్తాన్ని కూడా వీడియో రికార్డింగ్ చేశారు. ఆదివారం సైతం చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నించారు.