- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఉమ్మడి జిల్లాలో విందు రాజకీయం.. దూరమైన కేడర్‌కు ఆహ్వానం
దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల అభ్యర్థుల జాబితాను సీఎం జగన్ జగన్ మోహన్ రెడ్డి దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. అయితే ఈ జాబితాలో కొందరు పేర్లు లేవని, వారిస్థానంలో మరొకరికి అవకాశం కల్పిస్తూ జాబితా సిద్ధం చేశారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు చేజారకుండా వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు కొత్త ఏడాది ప్రారంభం నుంచే బలప్రదర్శనకు దిగుతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా వారితో ఆత్మీయ సమావేశాలు, విందులు ఏర్పాటు చేస్తున్నారు. దూరమైన కేడర్‌ను దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ వెంట ఉండాలని ఈ విందుల్లో కోరనున్నారు. దీంతో న్యూయర్ ఏర్పాట్లలో వైసీపీ నేతలు బిజీ బిజీగా ఉన్నారు.
కాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో వడపోతలు ప్రారంభమయ్యాయి. ఇందుకు తగట్టు పత్తిపాడు, కాకినాడ, జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ టికెట్ నిరాకరించారు. దీంతో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాకినాడ నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆయన కిర్లంపూడిలో విందు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. జగ్గంపేట నియోజకవర్గంలో తోట నరసింహులు ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన వీరవరంలో న్యూ రోజున విందు నిర్వహిస్తున్నట్లు కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఇక జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు టికెట్ నిరాకరించారు. దాంతో ఆయన కేడర్‌ను కాపాడుకునేందుకు జనవరి 1న విందు నిర్వహిస్తున్నారు. నాలుగు మండలాల కార్యకర్తలు, ముఖ్యనేతలందరూ విందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యేకు వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించడంతో ఆయన కూడా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహిస్తున్నారు. పార్టీ కేడర్‌కు విందు ఇచ్చి దగ్గర చేసుకోనున్నారు.