Breaking: కాకినాడ జిల్లాలో ఘోరం..ఆరుగురు మహిళలు దుర్మరణం

by srinivas |   ( Updated:2023-05-14 10:15:03.0  )
Breaking: కాకినాడ జిల్లాలో ఘోరం..ఆరుగురు మహిళలు దుర్మరణం
X

దిశ, డైనమిక్ బ్యూరో‌: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాళ్లరేవు మండలం సీతారామపురం సుబ్బరాయుని దిబ్బ వద్ద ఆటోను ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు మహిళలు కావడం గమనార్హం. మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మహిళలు ఓ రొయ్యల పరిశ్రమలో పని చేసి ఆటోలో తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story