- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ జిల్లాలో కంపించిన భూమి.. ఇళ్లల్లో నుంచి పరుగులు తీసిన జనం
దిశ, డైనమిక్ బ్యూరో : ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు ఆందోళన కలిగించాయి. ముండ్లమూరు గ్రామంలో ఆదివారంనాడు ఉదయం భూమి కంపించింది. దాదాపు రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో భయపడిన ప్రజలు ఇళ్లలో నుండి రోడ్లపైకి పరుగులు తీశారు. భూమి కంపించడానికి ముందు భారీ శబ్ధం వినిపించిందని స్థానికులు చెప్తున్నారు. ఆ భారీ శబ్ధం వినిపించిన అనంతరం కాసేపటికే భూమి కంపించడంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీసినట్లు గ్రామస్థులు చెప్తున్నారు. ఇకపోతే ఈ ఏడాది మార్చిలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాతసలో భూమి కంపించింది. దీంతో గ్రామంలోని పలు ఇళ్ల గోడలు బీటలువారాయి. పలు సిమెంట్ రోడ్లు దెబ్బతిన్నాయి. అంతకు ముందు ఫిబ్రవరిలో ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. పులిచింతల ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో తరచుగా భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.