రోడ్లు బాగోలేదని వైసీపీని వద్దనుకోవద్దు: మంత్రి ధర్మాన ప్రసాదరావు

by Seetharam |
రోడ్లు బాగోలేదని వైసీపీని వద్దనుకోవద్దు: మంత్రి ధర్మాన ప్రసాదరావు
X

దిశ , డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం, జనసేన పార్టీలు సంయుక్తంగా రోడ్ల దుస్థితిపై నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఉమ్మడి కార్యచరణలో భాగంగా పి.గన్నవరం నియోజకవర్గంలో గుంతల ఆంధ్రప్రదేశ్‌కి దారేది అంటూ పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఈ ఆందోళనలపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్లు బాగోలేవని వచ్చే ఎన్నికల్లో వైసీపీని వద్దనుకోవద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్ల వల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయా? అంటూ ప్రశ్నలు సంధించారు. చెన్నై, కర్నూలు రాష్ట్ర రాజధానులుగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు అక్కడకు వెళ్లడానికి రెండు రోజులు పట్టేదని చెప్పుకొచ్చారు. విశాఖ కంటే గొప్ప అర్హతలు ఉన్న రాజధాని ఏపీలో లేదని చెప్పుకొచ్చారు. విశాఖ రాజధాని వల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో విద్యుత్తు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఏపీ కంటే ధరలు తక్కువ ఉన్న రాష్ట్రం ఏదో చెప్పగలరా అని ప్రశ్నించారు. సీఎం జగన్ చేసిన ఉపయోగం లేని పనులు ఏమిటో టీడీపీ నేతలు చెప్పలేకపోతున్నారంటూ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed