- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ వార్తను ఎవ్వరూ నమ్మకండి.. దిశ పేరుతో మరోసారి ఫేక్ క్లిప్పింగ్
దిశ, డైనమిక్ బ్యూరో:దిశ పత్రిక బ్రాండ్ తో కొంత మంది స్వార్థపరులు మరోసారి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి ఆ క్లిప్పింగులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఏపీలో సచివాలయం తాకట్టు అనే అంశం రాజకీయ దుమారం రేపుతున్నది. తాకట్టులో సచివాలయం అంటూ ఓ తెలుగు దినపత్రికలో (దిశ కాదు) ఇటీవల ఓ కథనం ప్రచురితం అయింది. ఈ అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలో ‘సచివాలయం తాకట్టు కట్టుకథ’ అని ఈ వ్యవహారంలో సదరు దినపత్రికపై దావా వేస్తున్నామని హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ చెప్పిందని త్వరలోనే సదరు దినపత్రిక బ్యాన్? చేయబోతున్నారంటూ అచ్చం దిశ పత్రికలో కథనం వచ్చినట్లుగా గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఫేక్ క్లిప్పింగ్ ను క్రియేట్ చేశారు. దానిని షేర్ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నిజానికి దిశలో ఇటువంటి కథనమేది ప్రచురించురితం కాలేదని ఈ ఫేక్ క్లిప్పింగ్ పై దిశ యాజమాన్యం ఖండించింది. దిశ బ్రాండ్ కు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Read More..
సౌతిండియాలో బీజేపీకి అనూహ్య ఫలితాలు.. ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ సంచలన సర్వే