- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP:‘జగన్‌కు అంతమందితో సెక్యూరిటీ అవసరమా?’..హోం మంత్రి సెన్సేషనల్ కామెంట్స్!
దిశ,వెబ్‌డెస్క్: గత వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని హోం మంత్రి వంగలాపుడి అనిత విమర్శించారు. నేడు (మంగళవారం) పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మంత్రి అనిత ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జగన్ హయాంలో జరిగిన భూ దోపిడిపై వినతుల వెల్లువెత్తాయని తెలిపారు. అనంతరం మంత్రి అనిత మాట్లాడుతూ..జగన్ బాధితులు పులివెందుల నుంచి ప్రజాదర్బార్‌కు పెద్ద సంఖ్యలో వస్తున్నారని తెలిపారు. ఈక్రమంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు సరిపడా భద్రత కల్పిస్తున్నామని హోం మంత్రి అనిత తెలిపారు. ఆయనకు 980 మందితో భద్రత అవసరమా? అని ఆమె ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే తన భద్రత, ప్రతిపక్ష హోదా పై జగన్ హైకోర్టుకు వెళ్లారు. అంతేకానీ ఆయన ప్రజా సమస్యలపై కోర్టుకు వెళ్లడం లేదు. పులివెందులలోని జగన్ బాధితులు ప్రజాదర్బార్‌కు వచ్చి మొరపెట్టుకుంటున్నారు అని ఆమె వ్యాఖ్యానించారు.