- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విషాదం నింపిన దీపావళి సెలబ్రేషన్స్: భార్య మృతి, ముగ్గురుకి తీవ్రగాయాలు
దిశ, డైనమిక్ బ్యూరో : దేశవ్యాప్తంగా దీపావళి సెలబ్రేషన్స్ ఘనంగా జరిపాయి. కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల దగ్గర నుంచి సామాన్యుల వరకు ఈ దీపావళి వేడుకలను కన్నుల పండువగా జరుపుకున్నారు. దీంతో దేశమంతా దీపావళి వెలుగులు, బాంబుల మోతతో మార్మోగింది అని చెప్పుకోవచ్చు. అయితే అదే దీపావళి సెలబ్రేషన్స్ కొన్ని కుటుంబాల్లో విషాదం నింపింది. డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో దీపావళి వేడుకలు ఓ కుటుంబంలో విషాదం నింపింది. కొత్తపేట మండలం ఆవిడి కట్లమ్మ అమ్మవారి ఆలయం దగ్గర ఓ పూరి గుడిసెలో ఓ కుటుంబం ఉంటుంది. దీపావళి సందర్భంగా వేసిన తారాజువ్వలు ఆ పూరి గుడిసెపై పడింది. దీంతో క్షణాల్లో ఇల్లు అగ్నికి ఆహుతైంది. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్నపెదపూడి మంగాదేవి అనే మహిళ సజీవదహనం అయ్యింది. ఆమె భర్త దుర్గారావుకు తీవ్ర గాయాలపాలయ్యారు. దుర్గారావు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ దంపతుల ఇద్దరు కుమారులు సైతం మంటల్లో చిక్కుకుని గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో గాయపడిన తండ్రి, ఇద్దరు కుమారులను కొత్తపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇకపోతే పూరిగుడిసెలో పెట్రోల్‌ను నిల్వ చేసి పెట్టుకున్నారని అయితే తారా జువ్వపడగానే మంటలు చెలరేగి క్షణాల్లో ఇల్లు అగ్నికి ఆహుతైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.