వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం.. చెక్కు అందజేత

by srinivas |
వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం.. చెక్కు అందజేత
X

దిశ, అమరావతి: కృష్ణా నదికి కనీవినీ ఎరుగని రీతిలో సంభవించిన వరదల కారణంగా దెబ్బతిన్న బాధితులను ఆదుకునేందుకు దివీస్ సంస్థ భారీ విరాళంతో ముందుకు వచ్చింది. దివీస్ సీఈవోదివి కిరణ్ ఆదివారం హైదరాబాద్‌లో మంత్రి నారా లోకేష్‌ను కలిసి ఐదు కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. ఈనెల 1 నుంచి 8వ వరకు వరద బాధితులకు ఆహారాన్ని అందజేసేందుకు గాను అక్షయపాత్ర ఫౌండేషన్‌కు మరో రూ. 4.8 కోట్లను దివీస్ సంస్థ అందజేసింది. మొత్తంగా రాష్ట్రంలో వరద బాధితుల కోసం 9.8 కోట్ల రూపాయల విరాళాన్ని అందించిన దివీస్ సంస్థను మంత్రి నారా లోకేష్ అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుతో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్న దాతలకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed