టీడీపీ సోషల్ మీడియాలో మూడో ర్యాంకు సాధించిన TNSV జిల్లా కార్యదర్శి

by Jakkula Mamatha |
టీడీపీ సోషల్ మీడియాలో మూడో ర్యాంకు సాధించిన TNSV జిల్లా కార్యదర్శి
X

దిశ,కనిగిరి:నియోజకవర్గంలో సోషల్ మీడియాలో మూడో ర్యాంకు సాధించిన పోకా నాయుడు బాబుకు చంద్రబాబు చేతుల మీదుగా టీడీపీ జెండాను అందుకున్నాడు.మన టీడీపీ సోషల్ మీడియా యాప్ లో పోక నాయుడు బాబు కనిగిరి నియోజకవర్గంలో టాప్ 5 లో 3 ర్యాంక్ సాధించినట్లు టీడీపీ స్టేట్ పార్టీ కార్యాలయం నుంచి తనకు మెసేజ్ అందినట్లు మాజీ టిఎన్ఎస్వి జిల్లా కార్యదర్శి పోక నాయుడు బాబు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మన టీడీపీ యాప్ ను ఉపయోగిస్తూ వైసీపీ ప్రభుత్వ అవినీతి అక్రమాలను సోషల్ మీడియా వేదికగా ఎండగడుతూ ప్రజలకు చేరవేస్తున్నందున నియోజకవర్గంలోనే టాప్ ఫైవ్ లో నాకు 3 ర్యాంక్ దక్కినట్లు తెలిపారు.

మన టీడీపీ యాప్ లో నాకు ఇప్పటివరకు 513750 పాయింట్ల పట్టికను చేరానని గతంలో కూడా ప్రశంసా పత్రం, టిడిపి ఫ్లాగ్,ఉగ్ర చేతుల మీదుగా టేబుల్ స్టాండ్ సైకిల్ అవార్డులను పొందినట్లు పోక తెలిపారు.రానున్న నెల రోజులపాటు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి టీడీపీ ఉమ్మడి కోటమి అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గెలుపే ధ్యేయంగా పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు సాయి శక్తుల సోషల్ మీడియాలో కృషి చేస్తానని పోక నాయుడు తెలిపారు.

Advertisement

Next Story