‘దిశ’ ఎఫెక్ట్.. బాలుడికి 20 ఏళ్లు జైలు శిక్ష

by sudharani |
‘దిశ’ ఎఫెక్ట్.. బాలుడికి 20 ఏళ్లు జైలు శిక్ష
X

దిశ, వెడ్‌డెస్క్: మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, లైంగిక వేధింపులను ఆపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘దిశ’ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ద్వారా అత్యాచార, లైంగిక వేధింపుల కేసుల్లో 14 రోజుల్లోనే విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చి వెంటనే శిక్ష అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే 7 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ బాలుడికి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించి దిశ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో గతేడాది మే 8న ఏడేళ్ల బాలిక ఇంటి ముందు ఆడుకుంటున్న క్రమంలో 17 ఏళ్ల బాలుడు తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు కూడా అదే విధంగా ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అది గమనించి బాలిక మేనత్త చిన్నారి తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో బాధితురాలి తల్లి బాలుడిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోక్సో, దిశ చట్టాల కింద బాలుడిపై కేసు నమోదు చేసుకుని.. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన అనకాపల్లి దిశ డీఎస్పీ పక్కా ఆధారాలను కోర్టుకు సమర్పించారు. దీంతో నిందితుడైన బాలుడికి విశాఖపట్నం స్పెషల్ సెషన్ కోర్టు జడ్జి 20 సంవత్సరాల శిక్ష విధించారు. అంతే కాకుండా రూ. 5 వేలు జరిమానా కూడా విధిస్తూ జడ్జి తీర్పును ఇచ్చారు.

Advertisement

Next Story