- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే అక్రమాలపై పల్నాడు లో చర్చ..ఉతికి ఆరేసిన చంద్రబాబు?
దిశ ప్రతినిధి, గుంటూరు: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలో టార్గెట్ గా ఎంచుకున్నట్టు అర్థం అవుతుంది. శనివారం పల్నాడు ప్రాంతంలోని దాచేపల్లి లో జరిగిన రా కదలి రా సభలో చంద్రబాబు రామకృష్ణారెడ్డి,అతని సోదరుడు చేస్తున్న అక్రమాల గురించి ఉతికి ఆరేసాడు. చంద్రబాబు పిన్నెల్లి అక్రమాలను ఏకరువు పెడ్తుంటే సభకు హాజరైన ప్రజానీకం నివ్వెరపోయారు. ఇప్పటి వరకు పిన్నెల్లి బ్రదర్స్ అక్రమాలు మాచర్ల ప్రజలకే తెలుసు అనుకుంటున్నారు. అలాంటిది చంద్రబాబు తన ప్రసంగంలో వారి అక్రమాలు ఎత్తిచూపటంతో రాష్ట్రం మొత్తం వారి అక్రమ వ్యవహారం తెలిసిపోయింది. పైగా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన కొద్ది కాలానికి చిన్న కాకాని సమీపంలో రామకృష్ణ రెడ్డి చంద్రబాబు ను అరే కొజ్జా లాంటి తీవ్ర పదజాలంతో విమర్శించారు. అప్పటి నుంచి పిన్నెల్లి వ్యవహారాల పై చంద్రబాబు దృష్టి సారించారని తెలిసింది.
పిన్నెల్లి అనుచరులు మాచర్ల లో అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతూ వస్తున్నారని ఎప్పటి నివేదికలు బాబుకు అందుతూనే ఉన్నాయి. పేదల ఆస్తులను స్వాధీనం చేసుకోవడం,వందల ఎకరాలు, ఖాళీ స్థలాలు మాచర్ల ప్రాంతంలో ఆక్రమాలకు గురయ్యాయి. టీడీపీ వారిని వేధించటం,పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించడం,అక్రమ మద్యం వ్యాపారం, గ్రానైట్ లారీ కలెక్షన్,లాంటి అక్రమాలు చేయటంతో పాటు హత్యా రాజకీయాలు పిన్నెల్లి ప్రోత్సహిస్తున్నారని కూడా అతని పై బాబు ధ్వజం ఎత్తరు.
పైగా ఎస్సీ ఎమ్మెల్యే లను మార్చడం కాదు పిన్నెల్లి, లాంటి వారిని మార్చు అంటూ సీఎం జగన్ కు సూచించారు. దీనికి తోడు మాచర్ల టీడీపీ ఇంఛార్జి జూలకంటి బ్రహ్మ రెడ్డి నీ పులి గా వర్ణించారు. మాచర్ల లో పులి వచ్చింది, మేకలు పారి పోతున్నాయని ఎద్దేవ చేశారు.జూలకంటి పార్టీ కి చేస్తున్న సేవలతో పాటు,ప్రత్యర్ధులను ఢీకొంటున్న వైఖరిని చంద్ర బాబు కొనియాడారు. పిన్నెల్లి వ్యవహారాల పై చంద్ర బాబు ఉద్వేగ ప్రసంగం చేశారు. చంద్రబాబు ప్రసంగం వింటున్న పల్నాటి వాసులు నివ్వెరపోయారు. పిన్నెల్లి తో పాటు పల్నాడు జిల్లా లో మిగిలిన ఎమ్మెల్సే ల అక్రమాల గురించి కూడా విమర్శించారు. ఐతే అందరికన్నా పిన్నెల్లి పై నే విమర్శల జడివాన కురిపించారు.