పవన్‌పై పోటీకి రామ్‌గోపాల్ వర్మ సై.. సోషల్ మీడియాలో ట్వీట్ వైరల్

by srinivas |
పవన్‌పై పోటీకి రామ్‌గోపాల్ వర్మ సై.. సోషల్ మీడియాలో ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పవన్ కల్యాణ్‌పై తాను కూడా పోటీ చేస్తున్నట్లు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. తన ‘వ్యూహం’... ‘శపథం’ సినిమాల్లో పవన్ కల్యాణ్‌పై సెటైరికల్ సీన్లు చిత్రీకరించిన రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు డైరెక్ట్‌గా ఆయననే ఢీకొట్టేందుకు రెడీ అవుతున్నారు. పిఠాపురం బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నట్లు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. అయితే పవన్ కల్యాణ్‌పై పోటీ చేస్తున్నట్లు ఆకస్మికంగా నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. అంతేకాదు తాను పిఠాపురం నుంచి పోటీ చేయడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. . గత ఎన్నికల ముందు నుంచి రామ్ గోపాల్ వర్మ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో వైసీపీ నుంచి ఆర్జీవీ పోటీ చేయబోతున్నారా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Read More..

నాగబాబు పోటీపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు




Next Story