- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కర్ణాటక ఫలితాలతో టీడీపీలో భిన్నాభిప్రాయాలు
దిశ, ఏపీ బ్యూరో : ‘ఇద్దరూ ఆగర్భ శ్రీమంతులు. ఉన్నత విద్యావంతులు. ఇద్దరిదీ ఘనమైన వారసత్వం. అవినీతి మచ్చలేని వ్యక్తిత్వం. అయినా స్వతంత్ర భారత చరిత్రలో వీళ్లిద్దరూ ట్రోల్ అయినట్లు ఇంకెవరూ అవలేదు. చివరకు సొంత పార్టీ వాళ్లు కూడా వీళ్లను వదల్లేదు. ఇప్పుడు రాటు దేలారు. విమర్శలు చేసిన నోళ్లతోనే వారెవ్వా అనిపించుకుంటున్నారు..’ అంటూ సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు లోకేశ్, రాహుల్ ఫొటోలతో హల్ చల్ చేస్తున్నారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్న నాటి సంగతులను గుర్తు చేసుకుంటున్నారు. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్‌తో కలిసి ముందుకెళ్తేనే ప్రయోజనమన్నట్లు టీడీపీ కార్యకర్తల నుంచి వినిపిస్తోంది.
జనసేనానితో సంకటమేనా..!
జనసేనతో పొత్తు కర్నాటకలో జేడీఎస్ మాదిరిగా ఉంటుందని మరికొందరు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ, టీడీపీకి పోటాపోటీ సీట్లు వచ్చినప్పుడు పవన్ ప్లేటు ఫిరాయించడనే గ్యారంటీ లేదంటున్నారు. అప్పుడైనా పవన్‌తో తిప్పలు తప్పవని అంచనా వేస్తున్నారు. కీలక సమయంలో బీజేపీ చక్రం తిప్పి పార్టీని దెబ్బతీసే అవకాశాలుంటాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా బలహీన పడుతున్న కాషాయ పార్టీతో పొత్తు టీడీపీకి నష్టమే తప్ప ప్రయోజనం లేదంటున్నారు. ఎన్నికల దాకా నాన్చి అప్పుడు జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఒక్కసారిగా పార్టీల మధ్య ఓట్లు షేర్ కావడం కష్టమనే సమస్యను ముందుకు తెస్తున్నారు. ఏడాది ముందు నుంచే ఉమ్మడి కార్యాచరణ లేకుంటే ఇబ్బందులు తప్పవని తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు.
కాంగ్రెస్ తో పొత్తే మేలా?
ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలించి చంద్రబాబు పొత్తులపై ఆచితూచి వ్యవహరించాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బలం పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు సాగితే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని కొందరు నాయకులు చెబుతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్‌తోపాటు వామపక్షాలు కూడా తోడయ్యే అవకాశాలున్నాయనే కోణంలో టీడీపీ శ్రేణులు తర్జన భర్జన పడుతున్నాయి. ప్రస్తుతం టీడీపీ నమ్మకమైన మిత్రులతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తున్నారు. అదే పార్టీ భవిష్యత్తుకు దోహదపడుతుందని భావిస్తున్నారు. పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న అభిప్రాయాలను బట్టి చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Read more: