పాదయాత్రలో సమస్యలు గమనించే పథకాల రూపకల్పన : జగన్

by Aamani |
పాదయాత్రలో సమస్యలు గమనించే పథకాల రూపకల్పన : జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: పాదయాత్ర సందర్భంగా ప్రజా సమస్యలను గమనించి పథకాలు రూపొందిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి ఇది మంచి వేదిక అన్నారు. ప్రభుత్వ సేవలను పొందడంలో అడ్డంకులకు ఈ కార్యక్రమం పరిష్కారం చూపుతుందన్నారు. లంచాలకు, వివక్షకు తావులేకుండా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. స్పందన ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరిస్తున్నామన్నారు. వ్యవస్థలో మార్పు కోసం ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు.

Advertisement

Next Story