AP News:అటవీ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష

by Jakkula Mamatha |   ( Updated:2024-06-20 08:22:43.0  )
AP News:అటవీ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో టీడీపీ కూటమి నూతన ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో ఏపీలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి రికార్డు సృష్టించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈక్రమలో పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పలు కీలక పదవులు అప్పగించారు.

ఈ నేపథ్యంలో బుధవారం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ రెస్ట్ లేకుండా శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖపై సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం, చెట్ల సంరక్షణ, తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఉపాధి హామీ పథకాన్ని ఉద్యాన వన పనులకు అనుసంధానించి నిధులు మంజూరు చేయడం పై తొలి సంతకం, గిరిజన గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధుల విడుదలపై రెండో సంతకం చేశారు. నిన్న పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షించిన పవన్ నేడు ఉపాధి హామీ పథకంలో సోషల్ అడిట్ విభాగంతో భేటీ అయ్యారు. ఉదయం 10 గంటల నుంచి అధికారులతో చర్చలు మొదలుపెట్టారు. ఛార్జ్ తీసుకున్న మొదటి రోజు నుంచే పాలనలో తన మార్క్‌ను చూపుతున్నారు.



Advertisement

Next Story

Most Viewed