Vikram Sarabhai:‘ప్రముఖ శాస్త్రవేత్త జయంతి’..డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు!

by Jakkula Mamatha |   ( Updated:2024-08-12 13:44:30.0  )
Vikram Sarabhai:‘ప్రముఖ శాస్త్రవేత్త జయంతి’..డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు!
X

దిశ,వెబ్‌డెస్క్:నేడు(ఆగస్టు 12) ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ జయంతి. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మన దేశం అంతరిక్ష పరిశోధన, అనుబంధ రంగాల్లో సాధిస్తున్న విజయాలకు ప్రధాన కారణం శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ అని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే ఈ రంగంలో విశిష్ట సేవలు అందించారని గుర్తుచేశారు. ఒక శాస్త్రవేత్త దేశం గురించి, తన చుట్టూ ఉన్న సమాజం గురించి ఆలోచన చేస్తే ఎంత గొప్ప ఫలితాలు ఉంటాయో దివంగత విక్రమ్ సారాభాయ్ జీవితాన్ని పరిశీలిస్తే అర్థం అవుతుందనీ పవన్ కళ్యాణ్ తెలిపారు.

ఈ క్రమంలో ఫిజిక్స్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు, భారత్‌కు శాటిలైట్ ఉండాల్సిన ఆవశ్యకతను నాటి ప్రధాని నెహ్రూకు వివరించి ఆయనను ఒప్పించడం, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నెలకొల్పడం ద్వారా భారతదేశ అంతరిక్ష అభివృద్ధికి విక్రమ్ సారాభాయ్ నాంది పలికారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఆ మహానీయుడి జయంతి సందర్భంగా..విక్రమ్ సారాభాయ్ చెప్పిన మాటలను ఇప్పటి తరం శాస్త్రవేత్తలు ఆచరించాలని డిప్యూటీ సీఎం పవన్ కోరారు.

Advertisement

Next Story

Most Viewed