ప్రకాష్ రాజ్ ట్వీట్‌పై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్.. సెన్సేషనల్ కామెంట్స్!

by Jakkula Mamatha |
ప్రకాష్ రాజ్ ట్వీట్‌పై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్.. సెన్సేషనల్ కామెంట్స్!
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల లడ్డూ(Tirumala Laddu) ప్రసాదం కల్తీ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ప్రకాష్ రాజ్ ట్వీట్‌పై డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో నటుడు ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్పందించారు. ఆయన తనకు శత్రువు కాదు. మంచి మిత్రుడే అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ నటుడిగా ఆయనంటే నాకు గౌరవం ఉంది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో దోషులకు శిక్ష పడాలనే ఉద్దేశంతో ట్వీట్ పెట్టానని, దానిపై ఆయన కామెంట్ చేయాల్సిన అవసరం లేదని పవన్ తెలిపారు. ఆయన ట్వీట్‌ను నేను తప్పుగా అర్థం చేసుకోలేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed