- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం..స్పందించిన డిప్యూటీ సీఎం పవన్
దిశ,వెబ్‌డెస్క్:రాష్ట్రంలో బాలికలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా అత్యాచారాలు చోటు చేసుకుంటున్నాయి. చట్టాలు ఎన్ని వచ్చినా ఆకృత్యాలకు అంతే లేకుండా పోతుంది. తాజాగా ఏపీలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన ఘటన కలకలం రేపింది. అభం శుభం తెలియని ఆ బాలికపై అత్యాచారం చేయడం సభ్య సమాజం సిగ్గుపడేలా చేస్తుంది. తాజాగా ఈ అమానవీయ ఘటన పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటన పై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..ఈ ఘటన షాక్‌కు గురి చేసిందన్నారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితులు 12, 13(మైనర్లు) ఏళ్ల బాలురు కావడం ఆందోళనకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. భావితరలకు ఆదర్శంగా ఉండాల్సిన బాలురు వాళ్ళ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నరు. యువకుల మనసులు చెడిపోవడానికి అనేక కారణాలున్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే పాఠశాల స్థాయిలోనే టీచర్లు, ప్రిన్సిపల్స్ కఠిన చర్యలు తీసుకునే సంస్కృతి రావాలి అని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం అన్యాయానికి గురైన ఆ బిడ్డకు, వారి కుటుంబానికి అండగా నిలబడాలని కోరుకుంటున్నానని చెప్పారు.