- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అనంత్ అంబానీ పెళ్లిలో ఆ విషయం పైనే చర్చ’..డిప్యూటీ సీఎం పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానంలో విజయ ప్రభంజనం సృష్టించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. జనసేన వంద శాతం స్ట్రయిక్ విజయం సాధించి దేశ రాజకీయాల్లో చర్చించుకునే విధంగా చేసింది. ఆ సమయంలో ఎక్కడ చూసినా, ఏ నోట విన్న జనసేన గెలుపు పై హోరాహోరీగా చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో జనసేన గెలుపు దేశంలోనే ఒక కేస్ స్టడీ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ క్రమంలో జనసేన అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖేష్ అంబానీ కుమారుడి వివాహ వేడుకకు అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ..అనంత్ అంబానీ పెళ్లికి వెళితే అందరూ జనసేన గెలుపు గురించే మాట్లాడారని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయానికి జనసేన తీసుకున్న నిర్ణయమే కారణమన్నారు. జనసేన ప్రజాప్రతినిధుల సత్కార కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తాను డిప్యూటీ సీఎం అవుతానని అనుకోలేదని చెప్పారు. ప్రధాని మోడీ మనసులో తనకు ప్రత్యేక స్థానం ఉందని డిప్యూటీ సీఎం పవన్ వెల్లడించారు.