- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆధారాలుంటే రాజీనామా చేస్తా: Narayana Swami
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అంతకుముందున్న లిక్కర్ బ్రాండ్లను మార్చేసిన విషయం తెలిసిందే. జగన్ అధికారంలోకి రాకముందు మధ్యపాన నిషేధం అని పాదయాత్రలో ఉందరగొట్టారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త లిక్కర్ బ్రాండ్లు వెలిశాయి. దాంతో ప్రజల ప్రాణాల పోతున్నాయనే విమర్శ ఉంది. మరోవైపు లిక్కర్‌లో వేల కోట్ల అవినీతి జరుగుతోందని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. ఇక లిక్కర్ వ్యవహారంపై బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోందని, దాని వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని మండిపడ్డారు. అంతేకాదు లిక్కర్ అక్రమ దందాపై కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని పురంధేశ్వరి హెచ్చరించారు.
దీంతో పురంధేశ్వరిపై వైసీపీ నేతలు విమర్శలు చేశారు. తాజాగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అయితే ఏకంగా పురంధేశ్వరికి సవాల్ విసిరారు. లిక్కర్ తాగి ఎవరైనా చనిపోయినట్టు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని చెప్పారు. పురంధేశ్వరి దగ్గర లిక్కర్ నాణ్యతపై ఆధాలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలో, టీడీపీ అధ్యక్షురాలో అర్థం కావడం లేదని నారాయణ స్వామి విమర్శించారు.