పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు పడకూడదు.. డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు

by Javid Pasha |
పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు పడకూడదు.. డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు
X

దిశ, ఉత్తరాంధ్ర: ఏ తల్లి ఆర్థిక ఇబ్బందులు వల్లన తన బిడ్డలను బడికి పంపకుండా ఉండకూడదనే ఒక గొప్ప సంకల్పంతో బడికి పిల్లలు పంపే ప్రతి తల్లికి ఏటా పదిహేను వేల రూపాయలు సీఎం జగన్ ఇస్తున్న నవరత్నాల్లోని ఓ గొప్ప రత్నం అని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు. పేద కుటుంబాలకు చెందిన తల్లి లేదా సంరక్షకుడికి ఆర్ధికసహాయం అందించడం ఆంధ్రప్రదేశ్ అమ్మ ఒడి పథకం యొక్క ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేసిన అమ్మఒడి నాలుగో విడత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పిల్లలందరూ బడిబాట పట్టి చక్కని విద్యను అభ్యసించడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని ఒక వ్యక్తి యొక్క తరగతి, మతం, విశ్వాసం ఇతర సంబంధాలను పరిగణలోకి తీసుకోకుండా ఈ ఆర్థిక సహాయం అందించబడుతుందని కలెక్టర్ రవి పటాన్ శెట్టి అన్నారు.

రెసిడెన్షియల్ పాఠశాలలో సహా ఆమోదించబడిన ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలో విద్యార్థులు ఈ ప్రయోజనాన్ని పొందుతున్నారని, తద్వారా అక్షరాశ్యత రేటు పెరుగుతుందని, అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా అమ్మబడి 2022-23 సంవత్సరం గాను నాలుగో విడత 1,50,870 మంది తల్లుల ఖాతాలలో 226,3,50 కోట్లు జమ చేశామని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. అనతరం సంబందిత చెక్కును ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, కలెక్టర్ రవి పట్టన్ శెట్టి కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాాధికారి వెంకట లక్ష్మమ్మ, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి శిరీష, గ్రామ వార్డ్ సచివాలయం నోడల్ అధికారి మంజుల వాని పలువురు విధ్యార్ధులు వారి తల్లులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed