సమాధిని కూడా వదల్లేదు

by Mahesh |
సమాధిని కూడా వదల్లేదు
X

దిశ, నందికొట్కూరు: వైసీపీ నాయకుల భూదందా పరాకాష్టకు చేరింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉందని ఇష్టారాజ్యంగా భూదందా కు తెరతీశారు. నందికొట్కూరు పట్టణంలో సమాధుల స్థలం కూడా విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సమాధి స్థలాన్ని వైసీపీ నాయకుల ప్రమేయం తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. నందికొట్కూరు పట్టణంలో పగిడ్యాల రోడ్డు లో సుమారు 30 సంవత్సరాల క్రితం రోడ్డు పక్కన ఉన్న సమాధిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వైసీపీ నాయకులు విక్రయించడంతో సమాధిని కూల్చివేశారు.

తిక్కమ్మను దైవంగా భావించి..

గత 30 ఏళ్ల క్రితం తిక్కమ్మ అనే మతిస్థిమితం లేని మహిళ భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగించగా, పట్టణ ప్రజలు ఆమెను దైవంగా భావించే వారట. కాలక్రమేణా ఆమె మృతి చెందడం వలన దాతలు రెండు సెంట్ల స్థలం కేటాయించి అంత్యక్రియలు నిర్వహించినట్లు ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. అక్కడే ఉన్న దేవతకు నీలి శికారిలు ప్రతి ఏడాది జాతర లాగా నిర్వహిస్తారని, అయితే ఇప్పుడు ఆ స్థలం కబ్జాకు గురైంది. ఎవరు అక్రమించారో కూడా అధికారులకు తెలియకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారులు విచారణ జరిపి కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

మళ్లీ సమాధి నిర్మాణం

కబ్జాకు గురైన తిక్కమ్మ సమాధి నిర్మాణ పనులను అదే ప్రదేశంలో మళ్లీ చేపట్టారు. తిక్కమ్మ సమాధిని కూల్చివేయడం వలన గ్రామానికి అరిష్టం జరుగుతుందని కొందరు పండితులు, పెద్దలు చెప్పడంతో అదే ప్రదేశంలో వార్డు కౌన్సిలరు చాంద్ భాష సహకారంతో స్థానికులు శనివారం సమాధి నిర్మాణ పనులు చేపట్టారు.

Advertisement

Next Story