- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీకాళహస్తిలో ఉద్రిక్తత.. వైసీపీ నేతల అక్రమ కట్టడాలు కూల్చివేత
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో రివేంజ్ పాలిటిక్స్ షురూ అయ్యాయి. అధికారంలోకి తెలుగుదేశం పార్టీరావడంతో ఆ పార్టీ నాయకులు దెబ్బకు దెబ్బ తీస్తున్నారు. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకుల అక్రమాలకు టీడీపీ నాయకులు, కార్యకర్తల బాధితులుగా మిగిలిపోయారు. ఇప్పుడు వారికి అవకాశం రావడంతో జూలు విధిలించారు. వైసీపీ అక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలను వైసీపీ నాయకులు కబ్జా చేశారు. ఇదేంటని ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన ఆస్తులపై దాడులు చేయించారు. అక్రమ కట్టడాలంటూ కూల్చివేశారు. ఇప్పుడు అదే బాటలో తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం నడుస్తున్నారు. గత ఐదేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు చేసిన కబ్జాల లిస్టును బయటకు తీస్తున్నారు. వెంటనే అధికారులను పంపి అక్రమాలను తొలగిస్తున్నారు.
తాజాగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. జగన్ ప్రభుత్వ హయాంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ప్రభుత్వ స్థలాలను యదేచ్ఛగా ఆక్రమించి కట్టడాలు నిర్మించారు. దీంతో ఆ కట్టడాలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ ఫోకస్ పెట్టారు. తొట్టంబేడు మండలం రాజీవ్ నగర్‌లో వైసీపీ నేతలు నిర్మించిన అక్రమ కట్టాలను దగ్గరుండి మరీ అధికారులతో కూల్చివేయిస్తున్నారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత చోటు చేసుకున్నారు. అక్రమాలను కూల్చివేస్తున్న మున్సిపల్ అధికారులను వైసీపీ శ్రేణులు, ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ తీరుకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు. రాజకీయ కక్షతోనే తమ ఆస్తులను బొజ్జల సుధీర్ ధ్వంసం చేస్తున్నారని వైసీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అక్రమ నిర్మాణాలు కూల్చివేతలపై వైసీపీ నాయకులకు ప్రజల నుంచి ఎలాంటి మద్దతు రాకపోవడం విశేషం.