ఏపీలో ముగిసిన నామినేషన్ల గడువు.. మొత్తం ఎన్ని దాఖలయ్యాయంటే...!

by srinivas |
ఏపీలో ముగిసిన నామినేషన్ల గడువు.. మొత్తం ఎన్ని దాఖలయ్యాయంటే...!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజు కావడంతో గురువారం అభ్యర్థులు భారీగా తరలివెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రంలో 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు గాను మొత్తం 4941 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారు. వీటిలో పార్లమెంట్ స్థానాలకు 731, అసెంబ్లీ స్థానాలకు 4210 నామినేషన్లు వచ్చినట్లు స్పష్టం చేశారు. శుక్రవారం నుంచి నామినేషన్లను పరిశీలించనున్నారు. సరైన పత్రాలు లేకపోతే నామినేషన్లు తిరస్కరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

కాగా ఏపీలో మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. వైసీపీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. దీంతో మరోసారి ఎన్నికల్లో సత్తా చాటేందుకు వైసీపీ, ఎలాగైనా ఈసారి అధికారం దక్కించుకోవాలని టీడీపీ కూటమి ప్రయత్నాలు చేస్తున్నాయి. అటు సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఇటు చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి ఆయా పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed