- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలకు గడువు పెంచాలి: టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను వైసీపీ ప్రభుత్వం రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ఆరోపించారు. నిరుద్యోగుల అభ్యున్నతికి, ఉన్నతికి నిర్ణయాలు తీసుకొవాల్సిన ఏపీపీఎస్సీ వారిని రోడ్డున పడేసేలా వ్యవహరిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీ నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందని ధ్వజమెత్తారు. ఆనాలోచిత నిర్ణయాల వల్ల అస్తవ్యస్థంగా మారిందని చెప్పుకొచ్చారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 85 రోజులే గడువు ఇవ్వడం సరికాదు అని అభిప్రాయపడ్డారు. నిరుద్యోగుల జీవితాలతో చేలగాటమాడేలా ఎపీపీఎస్సీ వ్యవహరిస్తుందని విరుచుకుపడ్డారు. 85 రోజుల్లో మెయిన్స్ పరీక్షకు ఏవిధంగా సిద్ధమవుతారో చెప్పాలని నిలదీశారు. ఈ కాలం సరిపోతుందని ప్రభుత్వానికి ఏ సలహాదారుడు చెప్పాడు. ఎటువంటి ప్రయోజనాలు లేని సలహాదారుల మీద ఉన్న శ్రద్ధ రాత్రింబవళ్లు కష్టపడి చదువుతున్న వారి మీద నిరుద్యోగులపై లేదు అని మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు కనీసం మరో 3 నెలల సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాలుగేళ్ల తరువాత నోటిపికేషన్ ఇచ్చి నిరుద్యోగుల జీవితాలను అంధకారంలోకి జగన్ రెడ్డి నెట్టేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఆధికారంలోకి రాకముందు పాదయాత్రలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పారంటూ తీవ్ర విమర్శలు చేశారు. వ్యవస్థలను, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం, విధ్వంసం తప్ప జగన్ రెడ్డి పాలనలో ఒరిగింది ఏమీ లేదని నిరుద్యోగులు గుర్తించాలి అని ఎమ్మెల్సీ అశోక్ బాబు పిలుపునిచ్చారు. అనర్హులకు, అసమర్థులకు అధికారం ఇస్తే గత నాలుగేళ్లలో ఏమి జరిగిందో మళ్లీ అదే జరుగుతుందని గ్రహించాలి. నిరుద్యోగుల అగ్రహనికి గుర్వడం ఖాయం అని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ అశోక్ బాబు హెచ్చరించారు.