- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: ప్రియుడి మోజులో తండ్రిని కడతేర్చిన కూతురు
దిశ, వెబ్ డెస్క్: ప్రియుడి మోజులో తండ్రిని కూతురే కడతేర్చింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగింది. ఈరపు దొరస్వామి ప్రభుత్వ సూలు టీచర్ గా పని చేస్తున్నారు. ఆయనకు 25 ఏళ్ల కూతురు హరిత ఉన్నారు. ఆమె ఉన్నత చదువులు చదివారు. దొరస్వామి భార్య ఏడాదిన్నర క్రితం చనిపోయారు. దీంతో కూతురును దొరస్వామి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. అయితే కూతురుకి నెల కింద పెళ్లి సంబంధం కుదుర్చారు. తన పేరున రెండంస్తుల బిల్డింగును సైతం కూతురు పేరన రిజిస్ట్రేషన్ చేయించారు. తన రిటైర్మెంట్తో వచ్చే డబ్బులతో తన కూతురు పెళ్లిని గ్రాండ్గా చేయాలనుకున్నారు. అయితే ఈ లోపే తండ్రి దొరస్వామిని కూతురు హరిత కడతేర్చారు. ప్రియుడితో గడపాలనుకున్న ఆమె.. తండ్రి నిద్రిస్తుండగా ఇనుప వస్తువుతో కొట్టి చంపింది. కన్నతండ్రి అనే కనికరం లేకుండా దొరస్వామి తలపై కొట్టి చంపేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొరస్వామి హత్యలో ప్రియుడు హస్తం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.