సీఎంను కలిసినా నో క్లారిటీ... టెన్షన్‌లో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి

by srinivas |
సీఎంను కలిసినా నో క్లారిటీ... టెన్షన్‌లో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఇంచార్జుల మార్పుతో ఆయా నియోజకవర్గాల సిట్టింగ్ ఎమ్మెల్యేలు తాడేపల్లి సీఎం క్యాంపు బాట పట్టారు. సీఎం జగన్‌ను కలిసి వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ ఇస్తారా.. లేదా అనే విషయాన్ని తెలుసుకుంటున్నారు. ఇందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి క్లారిటీ ఇవ్వడంతో క్యాంపు కార్యాలయం నుంచి కొందరు అసంతృప్తగా వెళ్తిపోతున్నారు. మరికొందరు కొంచెం ఇష్టం.. కొంచెం కష్టంగా వెనుదిరుగుతున్నారు. ఈ కోవలోకి దర్శి వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా చేరిపోయారు.

దర్శి ఇంచార్జిగా మరో ఎమ్మెల్యేను వైసీపీ అధిష్టానం నియమించించింది. దీంతో శుక్రవారం సీఎం జగన్ మోహన్ రెడ్డిని సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కలిశారు. తన నియోజకవర్గంలో ఇంచార్జి మార్పుపై జగన్‌తో చర్చించారు. దీంతో ఆయనకు సీఎం జగన్ కొన్ని సూచనలు చేశారు. మరో నియోజకవర్గానికి వెళ్లాలని ఎమ్మెల్యేకు సూచించారు. బాగా ఆలోచించుకుని మరోసారి తమ నిర్ణయాన్ని వెల్లడించాలని ఎమ్మెల్యేకు జగన్ తెలిపారు. ఇక సర్వేల విషయంపైనా ఎమ్మెల్యేతో జగన్ ఎలాంటి చర్చలు జరపలేదు. సీటు ఇవ్వడం, ఇవ్వకపోడమనేది మరో రెండు, మూడు రోజుల్లో చెబుతామని మద్దిశెట్టికి సీఎం తెలిపారు.

దీంతో మద్దిశెట్టి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిశెట్టి మీడియాతో మాట్లాడారు. మరో రెండు, మూడు రోజుల్లో సీఎం జగన్‌ను కలుస్తానని, ఏ విషయం అప్పుడు చెబుతానని ఆయన తెలిపారు. తనకు సీటు ఇవ్వాలని సీఎంను కోరతానని, ఇవ్వకపోతే తన నిర్ణయాన్ని అప్పుడు చెబుతానని పేర్కొన్నారు.

తనను జనసేన నేతలు కలిశారని జరగుతున్న ప్రచారంపై మద్దిశెట్టి స్పందించారు. తనను ఏ పార్టీ నాయకులు కలవలేదని.. వైసీపీలో టికెట్ రాకపోతే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని మద్దిశెట్టి పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed