ఏపీలో దళితులు బతకాలంటే ఆయుధాలు పట్టాల్సిందే : మాజీమంత్రి కేఎస్ జవహర్

by Seetharam |
ఏపీలో దళితులు బతకాలంటే ఆయుధాలు పట్టాల్సిందే : మాజీమంత్రి కేఎస్ జవహర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో దళితులు బతకాలంటే ఆయుధాలు పట్టాల్సిందేనని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కేఎస్ జవహర్ అన్నారు. అమరావతిలో ఆదివారం మాజీమంత్రి కేఎస్ జవహర్ మీడియాతో మాట్లాడారు. దళిత యువకుడు కాండ్రు శ్యామ్‌కు మూత్రం తాగించారంటే అది జగన్ రెడ్డి అండదండలతోనేనని మాజీమంత్రి జవహర్ ఆరోపించారు. దళితులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉన్న నియోజకవర్గంలో ఈ విధంగా ఉంటే మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఏంటో అర్థమవుతుందని చెప్పుకొచ్చారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో హంతకుడు అనంతబాబు పై జగన్ చూపించిన ఆత్మీయతే నేరస్తులను ఎంతలా ప్రోత్సహిస్తోందో తెలుస్తుందని చెప్పుకొచ్చారు. వైసీపీ పాలనలో ముఖ్యంగా జగన్ పాలనలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోయానని ఆరోపించారు. నేరాల విషయంలో బీహార్‌ను తలదన్నేవిధంగా జగన్ పాలన సాగుతోందని మాజీమంత్రి జవహర్ ఆరోపించారు. దళితులపై దాడుల్లో జగన్ ప్రభుత్వం నెంబర్ వన్‌గా ఉందని ఎద్దేవా చేశారు.కాండ్రు శ్యామ్ విషయంపై నిరసన తెలియ చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేయడం అత్యంత దారుణమని అన్నారు. దళిత యువకుడిపై అత్యంత అమానుషంగా వ్యవహరిస్తే పోలీసులు అట్రాసిటి కేసులు పెట్టడంలో పోలీసులు పూర్తిగా విఫలం అయ్యారని మాజీమంత్రి కేఎస్ జవహర్ అన్నారు.

Advertisement

Next Story