- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నారా ఫ్యామిలీతో జూనియర్ ఎన్టీఆర్‌కి కటీఫ్..! అసలు రీజన్స్ ఇవే..
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో కుటుంబసభ్యులందరూ రంగంలోకి దిగారు. నారా లోకేష్, బాలకృష్ణ, భువనేశ్వరి టీడీపీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఇక బ్రాహ్మణి కూడా గత కొద్దిరోజులుగా లోకేష్, భువనేశ్వరి వెంటే ఉంటున్నారు. ఎన్టీఆర్ కుమారుడు రామకృష్టతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా ఎన్టీఆర్ అరెస్ట్‌ను ఖండించారు. ఇలా కుటుంబసభ్యులందరూ స్పందిస్తున్నా.. ఐదు రోజులైనా మామ అరెస్ట్‌పై జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడం టీడీపీ వర్గాలను కాస్త షాక్‌కు గురి చేస్తోంది. మామ జైల్లో ఉన్నా ఎన్టీఆర్ సైలెంట్‌గా ఉండటం రాజకీయ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
చంద్రబాబు అరెస్ట్‌పై ఎన్టీఆర్ స్పందించకపోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. టీడీపీకి ఎన్టీఆర్ పూర్తిగా దూరమై ప్రస్తుతం సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం సినిమా కెరీర్ ఫుల్ స్వింగ్‌లో సాగుతున్న తరుణంలో రాజకీయ రంగు అంటించుకోవడానికి ఎన్టీఆర్ ఇష్ట పడటం లేదు. గతంలో నారా భువనేశ్వరిని కించపరుస్తూ అసెంబ్లీలో వైసీపీ నేతలు కామెంట్ చేసిన సమయంలో ట్విట్టర్‌లో ఎన్టీఆర్ తూతూమంత్రంగా స్పందించారు. ఎన్టీఆర్ సరిగ్గా స్పందించలేదనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. భువనేశ్వరి ఇష్యూ సమయంలో స్పందించిన ఎన్టీఆర్.. ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఎందుకు స్పందించలేదనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.
చంద్రబాబు ఫ్యామిలీకి ఎన్టీఆర్ పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఫంక్షన్‌లో కలిసినప్పుడు పలకరించుకోవడం తప్పితే.. సంబంధాలు పెద్దగా కనిపించడం లేదు. ఈ సమయంలో రాజకీయంగా ఎన్టీఆర్ వివాదాస్పదం కాదర్చుకోవడం లేదని చెబుతున్నారు. రాజకీయ కక్ష సాధింపు కోసమే బాబును వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేయించిందనే వాదనలు ఉన్నాయి. దీంతో ఎన్టీఆర్ స్పందిస్తే మరింత వివాదం రాజుకునే అవకాశముంది. గతంలో చంద్రబాబును సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రశంసించడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. రజనీకాంత్ టార్గెట్‌గా తీవ్ర విమర్శలతో చెలరేగారు. ఇప్పుడు ఎన్టీఆర్ స్పందిస్తే వైసీపీ నేతలు అలాగే టార్గెట్ చేస్తే మరింత వివాదాస్పదం అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి వివాదాలకు దూరంగా ఉండాలని ఎన్టీఆర్ భావిస్తున్నారని, అందుకే బాబు అరెస్ట్‌పై నోరు మెదపడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్టీఆర్ నుంచి రియక్షన్ రాకపోవడంపై టీడీపీ అభిమానులు మండిపడుతున్నారు. మామ అరెస్ట్ అయి జైలుకెళ్లినా స్పందించరా? అంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో చంద్రబాబు కుటుంబంతో ఎన్టీఆర్‌కు పూర్తిగా కటీఫ్ అయినట్లు అర్థమవుతుందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. తన ఆప్త మిత్రుడైన కొడాలి నాని డైరెక్షన్‌లోనే ఎన్టీఆర్ నడుస్తున్నారని, అందుకే స్పందించలేదని మరికొంతమంది తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు.
Read More : Chandrababu Naidu arrest: నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన నందమూరి ఫ్యామిలీ