- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Kadapa: క్రికెట్ బెట్టింగ్.. వైసీపీ కీలక నేత అరెస్ట్

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో క్రికెట్ బెట్టింగ్ గుట్టు చప్పుడు కాకుండా వ్యాప్తి చెందుతోంది. పల్లెలు, పట్టణాల్లోనూ యదేచ్ఛగా కొందరు ముఠాలుగా ఏర్పడి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. బుకీలను ఏర్పాటు చేసుకుని మరీ ఆన్ లైన్‌లో గేమింగ్స్ నిర్వహిస్తున్నారు. భారీగా లావాదేవీలు జరుగుతున్నాయి. ఇటీవల వరల్డ్ ఛాంపియన్ ట్రోఫీ మ్యాచులు జరిగాయి. ప్రస్తుతం ఇతర దేశాల మ్యాచులు కూడా నడుస్తున్నాయి. ఇండియా మాస్టర్స్ వర్సెస్ వెస్ట్ ఇండియా మాస్టర్స్ ఫైనల్ టీ-20 (ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20, 2025) మ్యాచ్ జరుగుతోంది.
అయితే ఈ మ్యాచ్‌పై కడప జిల్లా(Kadapa District) ప్రొద్దుటూరు(Proddutur)లో క్రికెట్ బెట్టింగ్(Cricket Betting) నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. వైసీపీ(వైసీపీ)కి చెందిన కీలక నాగేంద్రతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి లక్షా 20 వేల రూపాయలు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు నాగేంద్ర అనుచరుడిగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.