CPI: వీటి వెనుక ఎవరు ఉన్నా కఠినంగా శిక్షించాలి.. సీపీఐ రామకృష్ణ డిమాండ్

by Ramesh Goud |
CPI: వీటి వెనుక ఎవరు ఉన్నా కఠినంగా శిక్షించాలి.. సీపీఐ రామకృష్ణ డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా(Social Media)లో తప్పుడు పోస్టులు(False Posts) పెట్టే వారిని వదలిపెట్టకూడదని సీపీఐ నేత రామకృష్ణ(CPI leader Ramakrishna) అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయంగా విమర్శలు(Criticize Political) చేయడం మంచిదే కానీ సోషల్ మీడియాలో దిగజారి ప్రవర్తిస్తున్నారని, మహిళలు అని చూడకుండా బూతులు తిట్టడం, అక్రమ సంబంధాలు(Illegal Relationships) అంటగట్టడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం అని, ఇలాంటి తప్పుడు పోస్టులు పెట్టేవారిని సపోర్టు చేయకూడదని అన్నారు.

సోషల్ మీడియా వేదికగా సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) కుటుంబాలను విమర్శిస్తున్నారని, మహిళ అయిన హోం మంత్రి అనిత(Home Minister Anita)పై కూడా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. జగన్(YS Jagan) మాజీ సీఎం అయినందుకు ఆయనను రాజకీయంగా విమర్శించాలి కానీ, జగన్ భార్య భారతి(Jagan's wife Bharti)ని సైతం విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వెనుక ఎవరు ఉన్నా యాక్షన్(Action) తీసుకోవాలని, అంతేగాక వారిని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. అంతేగాక సోషల్ మీడియాలో దిగజారి ప్రవర్తిస్తున్న వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని, వారిని కఠినంగా శిక్షించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed