లష్కర్‌లో క్రాస్ ఓటింగ్.. బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్

by srinivas |   ( Updated:2024-06-05 02:32:48.0  )
లష్కర్‌లో క్రాస్ ఓటింగ్.. బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్
X
  • ఆరు అసెంబ్లీ స్థానాలున్నా చివరి స్థానమే
  • ఒక్క ఎమ్మెల్యే లేని కాంగ్రెస్ సెకండ్ ప్లేస్‌లో
  • ఎమ్మెల్యేలే లేని బీజేపీ గెలుపు

దిశ, సిటీ బ్యూరో: సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ఓట్ల కౌంటింగ్‌లో కనిపించింది. అసెంబ్లీ, పార్లమెంట్‌కు ఓటర్లు భిన్నంగా స్పందించారు. ఈ లోక్‌సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 అసెంబ్లీ సెగ్మెంట్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నప్పటికీ ఓట్లు ఆ పార్టీ అభ్యర్థికి పడలేదని కౌంటింగ్‌లో తెలిసింది. నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లిహిల్స్, సనత్ నగర్, ముషీరాబాద్, సికింద్రాబాద్, అంబర్ పేట నియోజకవర్గాల్లో ఒక్క నాంపల్లి మజ్లిస్ ఎమ్మెల్యే మినహా ఆరింటిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా కూడా ఆ పార్టీ అభ్యర్థి టీ పద్మారావుకు మూడో స్థానం దక్కింది. బ్యాలెట్ ఓట్ల నుంచే కిషన్ రెడ్డి ఆధిక్యత కొనసాగిస్తూ రాగా.. పద్మారావు మూడో స్థానంలోనే కొనసాగారు. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజీపీకి, కాంగ్రెస్‌కు షిఫ్ట్ అయ్యిందన్న వాదనలున్నా యి. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరగా.. ఆయనను సికింద్రాబాద్ నుంచి పార్టీ బరిలోకి దింపింది కాంగ్రెస్. సీఎం కూడా ప్రచారంలో దానం కేంద్ర మంత్రి అవుతారని చెప్పడంతో దానం వ్యతిరేకంగా కలిసి పని చేసి దానంను ఓటిమి వరకు తీసుకెళ్లినట్లు బాహాటంగానే చర్చ జరుగుతోంది.

ఒక్క ఎమ్మెల్యే లేని బీజేపీ ఎలా గెలిచింది?

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. అయినా కిషన్ రెడ్డి సునాయాసంగా విజయం సాధించాడు. సిట్టింగ్ ఎంపీ అయిన కిషన్ రెడ్డికి అంబర్ పేట, ముషీరాబాద్, ఖైరతాబాద్ పై కొంత పట్టు ఉన్నా.. మిగిలిన నియోజకవర్గాల్లో ఆదరణ తక్కువే. అయినా 16వ రౌండ్ ముగిసే సరికి కిషన్ రెడ్డి గెలుపునకు సమీపంలో సుమారు 47,299 ఓట్లతో ఆధిక్యతలో కొనసాగారు. అప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థి దానంకు 3 లక్షల 83 వేల 634 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి టీ పద్మారావుకు మాత్రం లక్షా 20,712 ఓట్లతో మూడో స్థానం లో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Advertisement

Next Story

Most Viewed