అనకాపల్లి డీ‌ఎస్‌పీపై వేటు ?

by samatah |   ( Updated:2023-02-13 08:31:24.0  )
అనకాపల్లి డీ‌ఎస్‌పీపై వేటు ?
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి డీఎస్పీపై వేటు పడనున్నట్టు తెలుస్తోంది. ఆయనపై వస్తున్న అవినీతి ఆరోపణలు.. జిల్లా ఎస్‌పీ స్వయంగా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ రాష్ట్ర డీజీపీ చర్యలు తీసుకోబోతున్నట్టు సమాచారం. కొంత కాలం క్రితం అనకాపల్లి డీఎస్‌పీ సునీల్ కుటుంబ సభ్యులతో కలిసి కారు లో అరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన అరకు ఎంపీ కారును డీ కొట్టాడు.

అప్పుడు సునీల్ నడుపుతున్న కారు ఓ గంజాయి కేసులో సీజ్ చేసిందని వెళ్లడయ్యింది. దానికి ఉన్న నెంబర్ ప్లేట్ ఇంకో గంజాయి కేసులో పట్టుబడ్డ కారుదని తెలిసింది. ఈ విషయం బయట పడకుండా సునీల్ చేసిన యత్నం విఫలం కాగా, ఆంధ్రప్రదేశ్ పోలీస్ వర్గాల్లో ఈ అంశం చర్చనీయమయ్యింది.

దీనికి తోడు సునీల్ సివిల్ కేసుల్లో తల దూరుస్తూ భారీగా అవినీతి కి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిపై జిల్లా ఎస్‌పీ గౌతమి శాలిని డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే సునీల్ ను సస్పెండ్ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు తెలియ వస్తోంది. సునీల్ స్వస్థలం కడప కావటం..ఎంపీ అవినాష్ రెడ్డి తో తనకు దగ్గరి పరిచయం ఉందని ఆయన గతంలో పలుమార్లు చెప్పుకున్న నేపథ్యంలో ఈ విషయం ఆంధ్ర పోలీస్ వర్గాల్లో చర్చనీయంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed