కొట్టి చంపడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య! సంచలన విషయాలతో షర్మిల ట్వీట్

by Ramesh N |
కొట్టి చంపడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య! సంచలన విషయాలతో షర్మిల ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పార్టీపై ఏపీ కాంగ్రెస్ స్టేట్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ట్వీట్ చేశారు. ప్రముఖ పత్రికలో పనిచేసే జర్నలిస్ట్ శ్రీ కృష్ణ పై, కర్నూల్ లో ఓ ప్రముఖ పత్రిక కార్యాలయం మీద వైసీపీ మూకల దాడి అమానుషమని పేర్కొన్నారు. ఇవి ఉద్దేశ్య పూర్వకంగానే చేస్తున్న దాడులు చేశారని ఆరోపించారు. ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పత్రికా స్వేచ్ఛను వైసీపీ హరిస్తుంది అనడానికి ఈ దాడులే నిదర్శనమని వెల్లడించారు.

నిజాలను జీర్ణించుకోలేక నిందలు మోపడం, ప్రత్యక్ష దాడులకు దిగడం, కొట్టి చంపడాలు అధికార పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని సంచలన ఆరోపణలు చేశారు. జర్నలిస్టులపై, పత్రికల కార్యాలయాలపై దాడులకు పాల్పడటం వైసీపీ పాలనలో నిత్యకృత్యమన్నారు. పత్రికా ప్రతినిధులపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా గాయపడిన జర్నలిస్ట్ శ్రీ కృష్ణకు క్షమాపణ చెప్పాలని, దాడికి పాల్పడ్డ వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story