నా గుండె తరుక్కుపోయింది... విజయవాడ పరిస్థితులపై షర్మిల ఆవేదన

by srinivas |   ( Updated:2024-09-04 14:45:08.0  )
నా గుండె తరుక్కుపోయింది...  విజయవాడ పరిస్థితులపై షర్మిల ఆవేదన
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ షర్మిల విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులను ఆమె పరామర్శించారు. వరద సహాయక చర్యలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ కొంప కొల్లేరు అయ్యిందని, బెజవాడ బుడమేరు అయిందన్నారు. సింగ్‌నగరలో వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతమని షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు పడుతున్న కష్టాలు స్వయంగా చూసి తన గుండె తరుక్కుపోయిందని చెప్పారు. వరదల్లో ఇప్పటికీ 35 మంది చనిపోయారని, 35 వేల ఇళ్లు కూలిపోయాయని, మొత్తం 5 లక్షల మంది దాకా నష్టపోయారని షర్మిల పేర్కొన్నారు.


విజయవాడలో ఇంత భారీ ఎత్తున విపత్తు సంభవిస్తే ప్రధాని మోడీ కనీసం స్పందించలేదని షర్మిల విమర్శించారు. విజయవాడ వరదలు కేంద్రానికి కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. తక్షణమే దీనిని జాతీయ విపత్తుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. 2005లో ఇలాంటి వరదలు వస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఇక్కడకు వచ్చారన్నారు. ‘‘బుడమేరు వరదలు రాకుండా సమస్య పరిష్కారం చేయాలని చూశారు. ఆపరేషన్ కొల్లేరును క్లియర్ చేశారు. ఆరోజుల్లో బుడమేరు కట్టలు బలోపేతం చేశారు. కానీ గత 10 ఏళ్లలో బుడమేరులో ఆక్రమణలు జరిగాయి. తెలంగాణలో హైడ్రా మాదిరిగా బుడమేరు ఆక్రమణలు తొలగించి రిటర్నింగ్ వాల్ కట్టాలి.’’ అని వైఎస్ షర్మిల సూచించారు.

Advertisement

Next Story

Most Viewed