వెంకటరెడ్డి లాంటి తీగలే కాదు... పెద్ద డొంకలు కూడా కదలాలి: వైఎస్ షర్మిల డిమాండ్

by srinivas |
వెంకటరెడ్డి లాంటి తీగలే కాదు... పెద్ద డొంకలు కూడా కదలాలి: వైఎస్ షర్మిల డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డి(Former MD of AP Mines Department Venkata Reddy) అరెస్ట్‌పై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Congress AP president YS Sharmila) స్పందించారు. వెంకటరెడ్డి లాంటి తీగలే కాదని, పెద్ద డొంకలు కూడా కదలాలని ఆమె కోరారు. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల దోపిడీపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద డొంక ఏ ప్యాలెస్‌లో ఉన్నా..విచారణ జరపాలని షర్మిల డిమాండ్ చేశారు. రూ.2,566 కోట్ల దోపిడీకి పాల్పడ్డ ఘనుడు వెంకట రెడ్డి అయితే తెరవెనుక ఉండి, సర్వం తానై, వేల కోట్లు కాజేసిన ఆ ఘనాపాటి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని షర్మిల ఎద్దేవా చేశారు.

‘‘5 ఏళ్లుగా రాష్ట్రంలో అడ్డగోలుగా సహజ సంపదను దోచుకు తిన్నారు. అస్మదీయ కంపెనీలకు మైనింగ్ కాంట్రాక్టులు కట్టబెట్టారు. టెండర్లు, ఒప్పందాలు, APMMC నిబంధనలను ఉల్లంఘించారు. అనుకున్న కంపెనీకి టెండర్లు ఇచ్చారు. ఎన్‌జీటీ నిబంధనలు బేఖాతరు చేశారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన నిధులు కొట్టేశారు. జగన్ ప్రభుత్వ (Jagan government) హయాంలో జరిగిన మైనింగ్ కుంభకోణం(Mining scam)పై ఏసీబీతో విచారణ చేయించాలి. అలాగే పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరపాలి. చిన్న చేపలను ఆడించి సొమ్ము చేసుకున్న పెద్ద తిమింగలాన్ని పట్టుకోవాలి. సహజ వనరుల దోపిడీపై సీబీఐతో విచారణ చేయించాలి.’’ అని షర్మిల డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed