- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అరెస్ట్‌తో చంద్రబాబుపై నమ్మకం మరింత పెరిగింది..స్కిల్ స్కామ్ కేసు నిలబడదు : ఎంపీ రామ్మెహన్ నాయుడు
దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అవినీతి జరగలేదు అని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ కేసు నిలబడదని అందరికీ తెలుసునంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆదివారం ఎంపీ రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌కు చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని కూడా చెప్పలేదు అని చెప్పుకొచ్చారు. అధికారులు రాజకీయ ఉద్దేశ్యంతో మాట్లాడుతున్నారు అని ఆరోపించారు. జగన్ క్రిమినల్ మైండ్ ఏ విధంగా ఉందో చూడొచ్చు అని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి తీసుకెళ్తాం అని చెప్పుకొచ్చారు. అరెస్ట్ తో చంద్రబాబుపై ప్రజలకు నమ్మకం ఇంకా పెరిగింది అని ఎంపీ రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక్క రుపాయి కూడా చంద్రబాబు కుటుంబానికి చేరలేదని.. చంద్రబాబు జైల్లో ఉన్నా చక్రం తిప్పుతున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు. చంద్రబాబు రిమాండ్‌లో ఉన్నా లోకేశ్ నేతృత్వంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏ విధంగా ఆందోళన చేపట్టామో అలాగే ఢిల్లీ కేంద్రంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల నేతల దృష్టికి తీసుకెళ్తామని చెప్పుకొచ్చారు. న్యాయ, ప్రజా పోరాటం చేస్తామని, ఏ రకమైనటువంటి అవకాశం ఉన్న అన్ని వేదికల మీద కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. జగన్ చేస్తున్న ప్రయత్నంలో ఓడిపోయారని..చంద్రబాబు నాయుడుపై మరింత నమ్మకం పెరిగిందని చెప్పుకొచ్చారు. ఢిల్లీలో నారా లోకేశ్ పలువురు న్యాయవాదులతో చర్చలు జరిపారని.. దేశ ప్రజలకు చంద్రబాబు అక్రమ అరెస్ట్ అంశాన్ని తెలియజేసే విధంగా లోకేశ్ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారని ఎంపీ రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.