ముగిసిన వాదనలు:సీఐడీ అధికారుల కాల్‌ డేటా పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

by Seetharam |
ముగిసిన వాదనలు:సీఐడీ అధికారుల కాల్‌ డేటా పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కాంకేసులో సీఐడీ తనను అరెస్ట్ చేసిన సమయంలో అక్కడ ఉన్న సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డు ఇవ్వాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషన్‌పై వాదనలు ముగించారు. అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈనెల 31న తీర్పు వెల్లడించనున్నట్లు విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు. ఇకపోతే ఈ పిటిషన్‌పై గురువారం కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. ఈ పిటిషన్‌పై సీఐడీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. అరెస్టు చేసే సమయానికి ముందు సీఐడీ అధికారులు పలువురిని ఫోన్‌ ద్వారా సంప్రదించారని చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదించారు. ఆ వివరాలు తెలిస్తే అరెస్టులో కీలక విషయాలు బయటపడతాయని వాదించారు. దర్యాప్తు సమయంలో కేసుకు సంబంధించి అధికారులు పలువురిని సంప్రదిస్తుంటారని సీఐడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఆ సమయంలో అధికారుల కాల్‌డేటా ఇవ్వడం గోప్యతకు భంగమని అన్నారు. ఆ ప్రభావం విచారణపై పడుతుందని సీఐడీ తరఫు న్యాయవాది వాదించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story