Ap: మాజీ సీఎం వల్ల అన్నీ పోగొట్టుకున్నా: జనవాణిలో ఓ తండ్రి తీవ్ర ఆవేదన

by srinivas |   ( Updated:2024-10-30 12:38:11.0  )
Ap: మాజీ సీఎం వల్ల అన్నీ పోగొట్టుకున్నా: జనవాణిలో ఓ తండ్రి తీవ్ర ఆవేదన
X

దిశ, వెబ్ డెస్క్: మంగళగిరి జనసేన పార్టీ(Janasena party) ఆధ్వర్యంలో చేపట్టిన జనవాణి కార్యక్రమం(Janavani programme)లో గత ప్రభుత్వంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆ పార్టీ నాయకులు ప్రతి మంగళవారం జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇవాళ సైతం సమస్యలపై వినతుల స్వీకరించారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్(Tadepalligudem MLA Bolishetti Srinivas) స్వయంగా బాధితుల సమస్యలను తెలుసుకున్నారు.

తాజాగా ప్రకాశం జిల్లా(Prakasam District) పుల్లలచెరువు మండలం యం.యర్రబాలెం(Yarrabalem) గ్రామానికి చెందిన కోటేశ్వరరావు తన కుమారుడి ఫీజు విషయలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ(YCP Govt) నిర్వాకంతో తన కొడుకు ఫీజులు కట్టలేని పరిస్థితి వచ్చిందని వాపోయారు. విదేశీ విద్య పథకానికి గత ప్రభుత్వం సాయం చేయలేదని, దాని వల్ల తన కుమారుడి నాలుగో సంవత్సరం ఫీజు కట్టుకోలేకపోతున్నానని కోటేశ్వరరావు పేర్కొన్నారు. జగన్ నిర్వాకం వల్ల తన ఇల్లు, వాకిలి అమ్ముకోవాల్సిన వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

విదేశీ విద్యా పథకం ద్వారా తన కుమారుడు ఫిలిప్సీన్స్ దేశంలో ఎంబీబీఎస్ చదవడానికి వెళ్లాడని, గత మూడేళ్లుగా జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సాయం అందించలేదని తెలిపారు. పొలం, ఇల్లు తాకట్టు పెట్టి పీజులు కట్టానని, ఇప్పుడు తన కుమారుడు ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడని, ఫీజులు కట్టాలని కాలేజీ యాజమాన్యం ఒత్తిడి చేస్తోందని, తనకు ఆర్థిక స్తోమత లేదని, ప్రభుత్వం సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోటేశ్వరరావు కోరుకున్నారు.

Advertisement

Next Story