- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Complaint: వైఎస్ జగన్‌పై తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో పిచ్చి కూతలు, రాతలు పెచ్చు మీరిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నేతలపై అసభ్య పోస్టులు పెట్టిన వారి గుట్టు రట్టు చేస్తోంది. సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan), హోంమంత్రి అనిత(Home Minister Anita), కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Congress state president YS Sharmila), ఆమె తల్లి వైఎస్ విజయమ్మ(YS Vijayamma)తో పాటు పలువురు నేతలు, నాయకురాళ్లపైనా సోషల్ మీడియాలో బూతు రాతలు రాసిన వారి తాట తీస్తోంది. ఒక్కొక్కరిని గుర్తించి జైలుకు పంపుతోంది. అయితే జైలుకు వెళ్తున్న వారిలో ఎక్కువగా తమ పార్టీ కార్యకర్తలు ఉండటంతో వైసీపీ అధినేత జగన్(YCP chief Jagan) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ అరెస్టులంటూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
దీంతో వైఎస్ జగన్‌పై తిరుపతికి చెందిన ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని పాలించే నేతలను అవమానిస్తూ సోషల్ మీడియాలో కారు కూతల కూస్తున్న కార్యకర్తలు అండగా నిలబడాన్ని తప్పుబట్టారు. అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని మందలించడం మానేసి, మద్దతుగా పోరాటం చేయడంపై మండిపడ్డారు. అసభ్య పోస్టులు పెట్టిన వారికి మద్దతుగా నిలవడం కూడా నేరమనేని ఆరోపించారు. ఈ మేరకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత కోడూరు బాలసుబ్రహ్మణ్యంతో ఆటో కార్మికులు కలిశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులను విమర్శించి, అసభ్యకర పోస్టులు పెట్టే వారి కోసం జగన్ పోరాటం చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.