AP News:పవన్ ‘సీజ్ ది షిప్’ ఘటనపై కలెక్టర్ కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2024-12-03 10:22:23.0  )
AP News:పవన్ ‘సీజ్ ది షిప్’ ఘటనపై కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: కాకినాడ పోర్టు(Kakinada Port)లో స్టెల్లా షిప్ సీజ్.. డిప్యూటీ సీఎం పవన్ తనిఖీల తర్వాత అధికార యంత్రాంగం కదిలింది. ఐదు శాఖల అధికారులతో కలిసి మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేశారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కాకినాడ పోర్టులో ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సీజ్ చేయించిన షిప్‌లో PDS బియ్యం ఎక్కడి నుంచి వచ్చిందో విచారిస్తున్నామని కాకినాడ కలెక్టర్ షాణ్మోహన్ అన్నారు. రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లై, పోర్ట్‌, కస్టమ్స్‌ అధికారులతో టీం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.

ఎగుమతిదారు ఎవరు? ఏ గోదాం నుంచి షిప్ వరకు వచ్చింది? తెలుసుకునేందుకు కస్టమ్స్ శాఖ ఐదుగురు సభ్యులతో బృందం ఏర్పాటు చేసింది. ‘రేషన్‌ బియ్యం విషయంలో అధికారుల వైఫల్యం ఉంది. షిప్ సీజ్ చేశాం. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు చేస్తున్నామని’ కలెక్టర్ తెలిపారు. గోడౌన్ నుంచి షిప్ వరకు బియ్యం ఎలా తరలించారో తేలుస్తాం కాకినాడ కలెక్టర్ పేర్కొన్నారు. బ్యాంక్ గ్యారంటీతో విడుదలైన బియ్యం షిప్‌లో ఉందో లేదో నిర్ధారిస్తామన్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

Advertisement

Next Story