- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలవరం ఫైల్స్ దగ్ధంపై కలెక్టర్ యాక్షన్.. నలుగురిపై సస్పెన్షన్ వేటు
దిశ, వెబ్‌డెస్క్: పోలవరం ఫైల్స్ దగ్ధం ఘటనపై కలెక్టర్ ప్రశాంతి సీరియస్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు. మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సీనియర్ అసిస్టెంట్‌లు కే. నూకరాజు, కారం బేబి, స్పెషల్ ఇన్స్‌పెక్టర్ కే. కళాజ్యోతి, ఆఫీస్ సబార్డినేటర్ సస్పెన్షన్‌కు గురయ్యారు. డిప్యూటీ తహశీల్దార్లు ఏ. కుమారి, ఏ.సత్యదేవికి నోటీసులు జారీ చేశారు. కాగా, పోలవరం ప్రాజెక్టు ఫైళ్లను గత శుక్రవారం రాత్రి తగలబెట్టేశారు. కొత్త బీరువాలు కొని పాతవన్నీ క్లీన్ చేస్తూ వేస్ట్ పేపర్లను దహనం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. పోలవరం ప్రధాన ఎడమ కాలువ పనుల కోసం చేపట్టిన భూసేకరణ చెల్లింపుల్లో భారీ స్కామ్ జరిగినట్టు ఆరోపణలు రావడం, ఈ సమయంలో ఫైళ్లు దగ్ధం కావడంతో ప్రభుత్వ పెద్దలు సీరియస్ అయ్యారు. దీనిపై కలెక్టర్ విచారణకు ఆదేశించి.. విధుల్లో నిర్లక్ష్యం చేసిన వారిపై యాక్షన్ తీసుకున్నారు.