Cobra : నాగుల చవితి రోజు నాగుపాము దర్శనం

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-05 08:26:31.0  )
Cobra : నాగుల చవితి రోజు నాగుపాము దర్శనం
X

దిశ, వెబ్ డెస్క్ : నాగుల చవితి (Nagula Chaviti) పర్వదినం రోజున శివాలయంలో నాగు పాము(Cobra)ప్రత్యక్షమవ్వడం వైరల్ గా మారింది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి శివాలయంలో నాగుపాము ఆకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. ఆలయానికి వచ్చిన భక్తులు నాగు పామును గమనించి పాముకి పాత్రలో పాలు పోశారు. నాగ చవితి రోజున నాగాభరణ ధారి పరమ శివుడు కొలువైన ఆలయంలో నాగుపాము దర్శనం ఇవ్వడంతో భక్తులు దైవ మహిమగా భావించారు. తండోపతండాలుగా తరలివచ్చి నాగుపామును దర్శించుకున్నారు. ఆలయంలోని పుట్ట వద్ద పూజలు నిర్వహించి, మహాశివుడికి అభిషేకాలు చేసి తమ భక్తిని చాటుకున్నారు.

Advertisement

Next Story