- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Assembly: అసెంబ్లీలో లిక్కర్ పాలసీ పై సీఎం చంద్రబాబు చర్చ.. అమాంతం పెరిగిపోయిన లిక్కర్ షేర్ల విలువ
దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్ పాలసీలో అవినీతి జరిగిందని, దీనిపై కచ్చితంగా విచారణ జరిపిస్తామని సీఎం అసెంబ్లీలో తెలిపారు. అలాగే గత ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలు, కొత్త బ్రాండ్ల వల్ల ప్రముఖ కంపెనీలు దొరకకుండా పోయాయని అన్నారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్రంలో తిరిగి పాత బ్రాండ్లను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం అయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో పలు లిక్కర్ కంపెనీల షేర్లు విలువలు ఒక్కసారిగా పెరిగాయి. క్వాలిటీ, టాప్ లిక్కర్ బ్రాండ్లను తిరిగి రాష్ట్రంలోకి అందుబాటులోకి తీసుకు రావడం మరిన్ని మద్యం షాపులు పెంచితే వినియోగం పెరుగుతుందని భావించడంతో తిలక్ నగర్ ఇండస్ట్రీస్ షేర్లు ఏకంగా 7.71శాతం పెరిగాయి. అలాగే జీఎం బ్రూవరీస్, యునైటెడ్ స్పిరిట్స్, రాడికో ఖైతాన్ షేర్లు 3-4 శాతం మేర పెరిగాయి. వీటితో పాటుగా గతంలో ఏపీలో మంచి అమ్మకాలను సాగించిన బాండ్ర కంపెనీల షేర్లు కూడా ఒక్కొక్కటిగా పుంజుకుంటున్నాయి.