మహాయజ్ఞ సంకల్పం తీసుకున్న సీఎం వైఎస్ జగన్

by Nagaya |   ( Updated:2023-05-12 08:11:00.0  )
మహాయజ్ఞ సంకల్పం తీసుకున్న సీఎం వైఎస్ జగన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహాయజ్ఞ సంకల్పం తీసుకున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం చేపట్టింది. ఈ మహా యజ్ఞంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ యజ్ఞ సంకల్పం తీసుకున్నారు. గోశాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కపిల గోవుకు హారతినిచ్చారు. అనంతరం అఖండ దీపారాధనలో సీఎం జగన్ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు వేదపండితులు ఆశీర్వాదం అందజేశారు. ఇదిలా ఉంటే మహాయజ్ఞంలో భాగంగా శుక్రవారం ఉదయం 5 గంటలకే మహామంగళ వాయిద్య హృద్య నాదం, భగవత్ ప్రీతిగా వేదస్వస్తి, గోపూజ, విఘ్నశ్వర-విష్వక్సేన, పుణ్యాహవచనం, దీక్షాధారణ, అజస్ర దీపారాధన తదితర కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. ఈ మహాయజ్ఞాన్ని 500 మంది రుత్వికులు నిర్వహించనున్నారు. శుక్రవారం నుంచి ఆరు రోజులపాటు అంటే ఈనెల 17 వరకు ఈ యజ్ఞం కొనసాగనుంది.

Also Read.

High Court: హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి బిగ్ షాక్

Advertisement

Next Story