- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై CM రేవంత్ సెన్సేషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్, టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ కాంగ్రెస్ విశాఖపట్నంలో శనివారం భారీ బహిరంగా సభను నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హజరైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
ఏపీలో బీజేపీ అంటే B-బాబు, J-జగన్, P-పవన్ కల్యాణ్ అని సెటైర్ వేశారు. ఈ ముగ్గురు ప్రధాని మోడీ బలం.. బలగమన్నారు. ఏపీలో ఎవరూ గెలిచిన ప్రధాని మోడీ దగ్గరకు వెళ్లే వారేనని రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కానీ ఏపీ ప్రజల కోసం మోడీ ఏం చేశారని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రశ్నించే గొంతులు లేవని.. ఉన్న వారందరూ ఢిల్లీ వెళ్లి వంగి నమస్కారాలు పెట్టేవారేనని ఎద్దేవా చేశారు.
కేంద్రంతో పోరాడి రాష్ట్రానికి కావాల్సినవి సాధించుకునే నాయకత్వం లేదని అన్నారు. ప్రధాని మోడీని ప్రశ్నించకపోవడం వల్లే ఏపీకి ఇప్పటి దాకా రాజధాని లేదన్నారు. ఏపీ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. ప్రశ్నించే గొంతులు ఉంటేనే ఢిల్లీ పాలకులు మన మాట వింటారని హితవు పలికారు. ప్రశ్నించే నాయకుడు లేకే మోడీ ఇన్నాళ్లు ఏపీని పట్టించుకోలేదని సంచలన వ్యా్ఖ్యలు చేశారు. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోడీని ఓడించాం.. కేడీని పడగొట్టామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఒక్క ఇంచు కూడా కదలించలేరని.. తెలుగు రాష్ట్రాల ఆస్తులను కొల్లగొట్టాలని చూస్తే.. రెండు రాష్ట్రాలు అన్నదమ్ముళ్లగా కలిసి పోరాడుదామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక పిలుపునిచ్చారు.