నేడే ఏపీలో CM రేవంత్ రెడ్డి బహిరంగ సభ.. కటౌట్లు వైరల్

by GSrikanth |   ( Updated:2024-03-16 05:11:11.0  )
నేడే ఏపీలో CM రేవంత్ రెడ్డి బహిరంగ సభ.. కటౌట్లు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. శనివారం ఏపీ కాంగ్రెస్ తలపెట్టిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి రాకను స్వాగతిస్తూ విశాఖ ఉక్కు కర్మాగారంలో విధులు నిర్వహిస్తున్న ఉక్కు తెలంగాణ ఉద్యోగుల సంక్షేమ సంఘం భారీగా బ్యానర్లు, కటౌట్లు కట్టింది. సభాస్థలి ప్రాంగణం సమీపంలో కట్టారు. ఉక్కు కర్మాగారంలో తెలంగాణకు చెందిన ఉద్యోగులు సుమారు వెయ్యి మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్టు సంఘం ప్రధాన కార్యదర్శి జి.ఆనంద్ తెలిపారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు విశాఖపట్నం ఉక్కు నగరం తృష్ణ మైదానంలో జరుగబోయే ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం అయ్యాక నిర్వహించబోయే తొలి సభ కూడా ఇదే కావడం గమనార్హం.







Advertisement

Next Story