- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి..కడుపైనా చేయాలంటాడు: హీరో బాలకృష్ణపై జగన్
దిశ, డైనమిక్ బ్యూరో : హిందూపురం ఎమ్మెల్యే , అగ్రనటుడు నందమూరి బాలకృష్ణపై సీఎం వైఎస్ జగన్ తొలిసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు నందమూరి బాలకృష్ణపై సీఎం జగన్ అంతగా విమర్శలు చేసిన సందర్భాలు లేవు. అయితే తొలిసారి సినీ నటుడు బాలకృష్ణ పై తీవ్ర విమర్శలు చేశారు. ‘అమ్మాయిలు కన్పిస్తే ముద్దైనా పెట్టాలంటాడు..కడుపైనా చేయాలని అంటాడు. ఇలాంటి దౌర్భాగ్యులు మన వలంటీర్ల గురించి విమర్శలు చేస్తున్నారు’ అని బాలకృష్ణపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. మరొకరి వయసు 75 ఏళ్లు. టీవీల్లోకి వచ్చి ఆహా బావ నీవు సినిమాల్లో చేశావు. నేను నిజ జీవితంలో చేసానని చెప్పుకొనే ముసలాయన అంటూ సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్యారెక్టర్ లేని వీళ్లంతా మంచి చేస్తున్న మన వలంటీర్ల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నారా లోకేశ్‌ను సైతం వైఎస్ జగన్ వదల్లేదు. పట్టపగలే మందు తాగుతూ పది మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్‌లో డాన్స్ చేసిన వీడియోలు యూ ట్యూబ్ లో ఉన్నాయని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. వలంటీర్లపై తప్పుడు మాటలకు నిర్మాత చంద్రబాబైతే, మాటలు, డైలాగ్ లు, నటనంతా దత్తపుత్రుడిదంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, సొంత పుత్రుడు, బావమరిది క్యారెక్టర్ ఎలాంటిదో అందరికీ తెలుసునని జగన్ అన్నారు. మహిళలను ఎక్కడికో పంపిస్తున్నారని నిస్సిగ్గుగా ఒకరంటున్నారని అలాంటి వారు ఈ రాజకీయ వ్యవస్థలో ఉండటం దారుణం అని సీఎం జగన్ అన్నారు.